భోగి మూవీ రివ్యూ 

Emotional Engagement Emoji 
 
మూవీ టైటిల్: భోగి
Banner : SRI SATYA SAI ARTS
Release Date : 27th నవంబర్ 2026
Censor Rating : ‘ A ‘
Cast : శర్వానంద్,అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి, లాల్, శరత్ లోహితాశ్వ తదితరులు 
Director : సంపత్ నంది
Producer: కె.కె. రాధామోహన్ (శ్రీ సత్యసాయి ఆర్ట్స్)
Music : భీమ్స్ సిసిరోలియో
Cinematography : కిషోర్ కుమార్ ఎ
Editor :  తమ్మిరాజు

శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది రూపొందించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయినా భోగి మూవీ ఎలా ఉందొ మనం తెలుసుకొందాం.

కథ :-
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బొగ్గుల గుట్ట అనే ఊరిలో గంగ ( శర్వానంద్) తన ఐదుగురు చెల్లెలితో కలిసి జీవిస్తుంటాడు.గంగ కి సులోచన ( అనుపమ పరమేశ్వరన్ ) అంటే ఇష్టం ఆమె ని పెళ్లి చేసుకోవాలనుకొంటాడు.  ఆ ఊరి ప్రజల మంచి కోసం ఆ ప్రాంత ప్రజల దేవుడు ‘పటేల్’ కొన్ని చీకటి కార్యాలు చేస్తూ ఉంటాడు. అతను చేసే ఆ చీకటి కార్యాలు ఏమిటి ?, వాటికి గంగ ఎలా ఎదురు తిరిగాడు ?, అసలు గంగ, పటేల్ పై తిరుగుబాటు చేయడానికి కారణం ఏమిటి ?, చివరికి పటేల్ ఆధిపత్య పోరును అణిచివేసి.. అతని పై గంగా ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు ? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

నటీనటుల పనితీరు 
ఈ మూవీ కి శర్వానంద్ నటనే ప్రధాన ఆకర్షణ. తను ఈ సినిమాని బలంగా నమ్మడమే, ఆ నమ్మకానికి తగ్గట్టు తన లుక్స్ పై, యాక్షన్ సీన్స్ లో తాను చేసిన కష్టమే ఈ సినిమాకి బలం. ముఖ్యమైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా శర్వానంద్ తన నటనతో మెప్పించాడు.
అనుపమ సులోచన పాత్రకు న్యాయం చేసింది.  డింపుల్ హయాతి తన పాత్రలో మెరిశారు. హీరోకి చెల్లెల్లుగా నటించిన నటీమణులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రణవి మానుకొండ బాగా నటించింది. ఇక ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సినిమా పై ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే జానపద శైలి పాటలు బాగున్నాయి.
సాంకేంతిక నిపుణుల పనితీరు
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సంపత్ నంది రచయితగా ఆకట్టుకోలేదు.  సినిమాటోగ్రాఫర్‌ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాని చాలా రూటేడ్ గా చూపించడం లో ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి.  ఎడిటింగ్ కూడా బాగుంది.  సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సమకూర్చిన పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
విశ్లేషణ
ఈ ‘భోగి’ రొటీన్ రివెంజ్ డ్రామాగా నిలిచింది. సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోవడం, బలహీనమైన స్క్రీన్‌ ప్లేను కవర్ చేయడానికి హింసను, రక్తపాతాన్ని ఎక్కువగా నమ్ముకోవడంతో సినిమా తేలిపోయింది. అటు సంపత్ నంది రచనతో పాటు ఆయన దర్శకత్వం కూడా ఆశించిన స్థాయిలో లేదు. మొత్తానికి ఈ గ్రామీణ యాక్షన్ చిత్రంలో శర్వానంద్ నటన మరియు పాటలు మాత్రమే కొంత ఉపశమనాన్ని కలిగించాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోలేదు.


Review by:
Hari Krishna